»17 Lakh Applications For Gruhalakshmi Scheme Within 3 Days
Gruhalakshmi: స్కీంకు ఆన్ లైన్ నమోదు, రసీదు లేదు..కుప్పలుగా దరఖాస్తులు
తెలంగాణలో గృహలక్ష్మి స్కీం ప్రకటించారు. కానీ అప్లై చేసిన తర్వాత కనీసం రసీదు కూడా ఇవ్వడం లేదని అప్లై చేసిన వారు అంటున్నారు. దరఖాస్తులను కుప్పలుగా పెడుతున్నారు తప్ప వాటిని ఆన్ లైన్లో కూడా నమోదు చేయడం లేదని వాపోతున్నారు. ఇలాంటి క్రమంలో అసలు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారని దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
17 lakh applications for Gruhalakshmi scheme within 3 days
Gruhalakshmi scheme: తెలంగాణ(Telangana)లో ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని జిల్లాలలో ఒకే సారి గృహలక్ష్మి(Gruhalakshmi) పథకానికి సంబంధించిన ప్రకటన రావడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో దరఖాస్తులు( applications ) వచ్చాయి. అయితే ఈ పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్నవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. దరఖాస్తులకు గురువారమే ఆఖరు అని చెప్పడంతో వేలాది మంది మండల కేంద్రాలకు తరలివచ్చారు. మూడు రోజుల్లోనే 17 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు. అయితే వీటిని తీసుకున్న అధికారులు ఏలాంటి రసీదు ఇవ్వలేదని, అప్లై చేసుకున్నట్లు కూడా ఏ ఆధారాలు లేకుండా చేశారని కొంత మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అసలు అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారని పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో మొదటి సారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేదలకు ఉచిత డబుల్ బెడ్రూమ్(Double bedrooms)లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్ని జిల్లాలో వీటిని నిర్మించలేదు. కొన్ని ఏరియాలో పూర్తిగా కట్టలేదు. కొన్ని చోట్ల పూర్తి అయినా ఇంకా లబ్ధిదారులకు పంచలేదు. కొన్ని చోట్ల ఇచ్చినా నాణ్యతలేపం ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి. ఇన్ని కారణాలతో ఈ స్కీమ్ పెద్దగా వర్క్అవుట్ కాలేదు. దీంతో కేసీఆర్ సర్కార్ ఈసారి ఇళ్లు కట్టుకునే స్థలం ఉంటే ప్రభుత్వమే రూ.3 లక్షలు ఇస్తుందని ప్రకటించారు.
ఎన్నికల సమయంలో దీన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. దీంతో పేదలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేస్తున్నారు. ఒక్కో మండల కేంద్రంలో 2 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 600కు పైగా మండలాలు ఉంటే 17 లక్షల అప్లికేషన్లు దాటుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే గృహలక్ష్మిఅప్లికేషన్లను అధికారులు కట్ట కట్టి పక్కన పెడుతున్నారు. అప్లికేషన్ తీసుకున్న తర్వాత దరఖాస్తుదారులకు కనీసం రసీదు కూడా ఇవ్వడం లేదు. కంప్యూటర్లోనూ ఆ వివరాలను నమోదు చేయడం లేదు. దీంతో తమ అప్లికేషన్లను ఏం చేస్తారోనని అర్హులు ఆందోళన చెందుతున్నారు. ఒక వేల వారికి ఈ స్కీమ్ రాకపోతే ఎవరి అడగలో కూడా స్పష్టత లేకుండా పోయిందని అంటున్నారు.
ఆ స్కీమ్ కింద మూడు విడుతల్లో లక్ష రూపాయల చొప్పున రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల మందికి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. కానీ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందకపోవడంతో గృహలక్ష్మి కింద పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. మరీ ప్రభుత్వం ఎందరికి ఈ స్కీమ్ ఇస్తుందో చూడాలి.