ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో ఘోర ప్రమాదం జరిగింది. 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మంది మృతిచెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. కోగి రాష్ట్రం నుంచి నైజర్ రాష్ట్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో 100 మంది గల్లంతైనట్లు నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి ఇబ్రహీం తెలిపారు. సామర్థ్యానికి మంచి ప్రయాణం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.