ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆశాపురి కాలనీలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. దీంతో ఇంటి పైకప్పు కూలి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. శిథిలాల కింద పలువురు మహిళలు, చిన్నారులు చిక్కుకున్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.