KMM: మణుగూరు మండలం కొండాయిగూడెం గ్రామానికి చెందిన బోయిళ్ల ప్రవీణ్ కుమార్ గత రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.మంగళవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రవీణ్ కుమార్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్ పాల్గొన్నారు.