నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా ఇప్పటివరకు 39 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా వివిధ నదుల నీటి మట్టాలు పెరుగుతాయని అక్కడి ప్రజలను అధికారులు హెచ్చరించారు. పశ్చిమాన ఉన్న నదులకు వరద పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మరో 24 గంటలపాటు వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. మరికొన్ని కొన్ని గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.