GDWL: ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో శనివారం వైద్య బృందం హాస్టల్కు చేరుకుని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. అస్వస్థతకు గురైన విద్యార్థులతో పాటు హాస్టల్లోని సుమారు 200 మందికి పైగా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులు అందజేశామని వైద్యులు తెలిపారు.