KRNL: హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, మహిళలు ఒంటరిగా గ్రామంలో వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. రెవెన్యూ అధికారులు స్పందించి గూళ్యం గ్రామంలో వీధి కుక్కల బెడద తగ్గించాలని గ్రామంలోని ప్రజలు కోరుతున్నారు.