నెల్లూరు: జిల్లా సోమశిల జలాశయానికి ఎగువప్రాంతల నుండి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో జలాశయానికి ఇన్‌ప్లో 15,548 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగు ప్రాంతాలకు అధికారులు 9వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయ సామర్థ్యం 78 టీఎంసీలు కాగా జలాశయం నీటిమట్టం 55 టీఎంసీలకు చేరింది.