బాపట్ల: జిల్లా కలెక్టర్ వెంకట మురళి సోమవారం నుంచి వారం రోజుల పాటు సెలవుపై వెళ్లారని అధికారులు సోమవారం తెలిపారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన సెలవుపై వెళ్లగా, అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ఇంఛార్జి కలెక్టర్గా వ్యవహరించనున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక జేసీ ప్రఖర్ జైన్ సారథ్యంలోనే జరిగింది.