BPT: గత పది రోజుల నుండి తుఫాను ప్రభావం వల్ల ఎడతెరిపి లేని వర్షాలతో మండలంలోని మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు. అయితే ఆది సోమవారాలలో సముద్రాన్ని తలపించే విధంగా మిర్చి పొలాలలో నీరు నిలువ ఉండి పూర్తిస్థాయిలో నేలమట్టమైనట్టు రైతాంగం వాపోతున్నారు. ఈక్రాప్ పంట నమోదు చేసిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపోయిన మిర్చికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.