SKLM: మీదుగా విశాఖపట్నం-భువనేశ్వర్ ఎక్స్ప్రెస్(08536) నవంబర్ 15 నుంచి నడపనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డుకు మధ్యాహ్నం 2:08 గంటలకు చేరుకుంటుంది. భువనేశ్వర్-విశాఖపట్నం(08535) రైలు శ్రీకాకుళం రోడ్డుకు ఉదయం 5:13 గంటలకు రానుంది. ఈ రైలు పొందూరు, శ్రీకాకుళం, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్లలో ఆగనుంది.