ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న వాల్మీకి విగ్రహానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు రెండు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ నగదును టీడీపీ నేత దేవినేని ధర్మతేజ ద్వారా వాల్మీకి సంఘం నాయకులకు స్థానిక ప్రజావేదిక వద్ద అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేకు కుందుర్పి వాల్మీకి కులస్తులు కృతజ్ఞతలు తెలిపారు.