కడప: నగర సమీపంలోని వాటర్ గండి ప్రాంతంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో నిర్వహించినట్లు నెహ్రూ యువ కేంద్ర సభ్యులు తెలియజేశారు. సోమవారం ఉదయం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలను తొలగించి చెత్త, చెదారాన్ని తొలగించారు. నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు విద్యార్థులు సూచించారు.