కృష్ణా: ఉయ్యూరు మండలంలోని విజయసాయి స్కూల్ విద్యార్థులు వరద బాధితులకు రూ.50 వేల విరాళం అందజేశారు. ఈ మేరకు స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు కలసి విరాళం చెక్‌ను పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు బుధవారం ఆయన కార్యాలయంలో అందజేశారు. వరద బాధితుల పట్ల మానవత్వంతో స్పందించిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు.