ATP: శింగనమల మండలం లోలురు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటిస్తున్నట్లు వారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. గ్రామాల్లో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.