VSP: అరకు మండలం దాబుగూడ కొండపై మైనింగ్ తవ్వకాలు నిలిపివేయాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ సభ్యులు పీ.రామన్న నేతలు కే.రమేష్, భాస్కరరావు డిమాండ్ చేశారు. మైనింగ్ తవ్వకాలు నిలిపివేయాలని కోరుతూ ఈనెల 6వ తేదీన బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈమేరకు గురువారం సభకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. మైనింగ్ తవ్వకాల వల్ల గిరిజనులకు నష్టం జరుగుతుందని అన్నారు.