SKLM: ఎచ్చెర్లలోని డా.బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో అయిదు రోజుల నుంచి విజయవాడ ఏజీ కార్యాలయం అధికారులు నిర్వహిస్తున్న ఆడిట్ శనివారంతో ముగిసింది. సభ్యులు ఎం.రమణమూర్తి, అర్పితైజైన్లు వర్సిటీలో సీపీఎస్ అమలులో జరిగిన అకాడమిక్ పనులుపై దస్త్రాలను పరిశీలించారు. వర్సిటీ రిజిస్ట్రార్ పీలా సుజాత, సీనియర్ అకౌంటెంట్ బి.విజయ, తదితరులు పాల్గొన్నారు.