VSP: బ్రిటిష్ కాలం నుండి అన్ని పత్రాలతో గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనేతరుల భూములను ఆన్ లైన్ లో నమోదు చేయాలని గొలుగొండ మాజీ జెడ్పీటీసీ చిటికెల తారకవేణుగోపాల్ కోరారు. కృష్ణదేవిపేటలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ భూములకు ప్రభుత్వపరంగా ఆన్ లైన్ లో నమోదు కాకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే వివిధ పథకాల రాయితీలను కోల్పోతున్నామన్నారు.