కృష్ణ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొత్తపేట పోలీసుల వివరాల మేరకు.. దుర్గామల్లేశ్వరరావు బైండింగ్ పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇటీవల కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపంతో బుధవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.