KNL: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం బేతంచెర్ల పట్టణంలోని బైటి పేట కాలనీలో ప్రజావేదిక, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కమిషనర్ హరి ప్రసాద్, తహశీల్దార్ ప్రకాశ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.