NLR: బుచ్చి పట్టణంలోని మలిదేవి కాలువ పక్కన ఉన్న డంపింగ్ యార్డ్‌ను ఎంపీడీవో శ్రీహరి, అగ్నిమాపక అధికారులు పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. డంపింగ్ యార్డులో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి 30 సెంట్లు కేటాయించామని తెలిపారు. ఇప్పటికే నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.