NLR: కలువాయి మండలంలోని కుల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డా. ఆదూరి శ్రీనివాసులు తనిఖీ చేయడం జరిగింది. అడ్మిషన్లు, వసతులు, APAAR మొదలగు విషయాల్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్యను మరింతగా పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.