E.G: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన జనవాణి కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలు పరిష్కారం కోరుతూ అర్జీలతో వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వెంటనే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారం చేయాలని సూచించారు.