KRNL: మండల కేంద్రంలో ఆర్ఎంపీల క్లినిక్‌లలో వైద్యాధికారి వాణిశ్రీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆర్ఎంపీ దేవేంద్ర తన క్లినిక్‌లో సెలైన్ బాటిళ్లు, ఇతర మందులు ఇవ్వడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిన ఆర్ఎంపీలు ఇలా ప్రజలకు వైద్యం పేరుతో ప్రజల ఆరోగ్యాలను పాడుచేస్తున్నారని ఫైర్ అయ్యారు. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.