మన్యం: తెలుగుదేశం పార్టీకి ఎవరు నష్టం కలిగించిన సహించేది లేదని ఎమ్మెల్యే విజయ్ చంద్ర హెచ్చరించారు. పార్వతీపురంలోని లయన్స్ కల్యాణ మండపంలో క్లస్టర్ యూనిట్, బూత్ ఇంఛార్జ్‌ల సమావేశం బుధవారం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తుందన్నారు.