NLR: జిల్లాలో 2024-25 సంవత్సరానికి ప్రాథమిక, మాధ్యమిక, సీనియర్ సెకండరీ పాఠశాలలకు కాంపొజిట్ స్కూల్ గ్రాంట్స్ నిధులను విడుదల చేస్తూ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి.శ్రీనివాస్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పీఎం శ్రీ స్కూల్స్, కేజీబీవీ, జూనియర్ కళాశాలలు మొత్తం 2,498 విద్యా సంస్థలకు రూ.6 కోట్లు కేటాయించారు.