NLR: విడవలూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పరీక్షల నిర్వహణను సోమవారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ విజయ భాస్కర్ రావు పరిశీలించారు. పరీక్షలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పలు సూచనలు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత ఆయనకు కళాశాల విశిష్టతను తెలియజేశారు.