PLD: చిరు వ్యాపారులకు టీడీపీ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుమారుడు నిఖిల్ పేర్కొన్నారు. పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డులోని రాఘవ టీ స్టాల్ వద్ద సోమవారం ఆయన స్థానికులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రాబోయే పట్టభద్రుల ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.