NLR: జిల్లాలో అన్ని రకాల విద్యుత్ బిల్లులను ఆదివారం యథావిధిగా చెల్లించవచ్చని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ విజయన్ తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు ఆదివారం పనిచేస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.