కృష్ణ: నాగాయలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని రేమాలవారిపాలెంలో గురువారం అక్రమ మద్యం నిల్వపై ఎస్సై కె.రాజేశ్ చర్యలు తీసుకున్నారు. 50 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని, ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు వివరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.