ప.గో: నరసాపురం పట్టణం రుస్తుంబాదలో ఉన్న శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం ఆలయ ఆవరణలో భక్తులచే అర్చకులు అభిషేకాలు చేయించారు. అనంతరం పెద్ద ఎత్తున భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.