AKP: విశాఖ డెయిరీ తగ్గించిన పాల ఉత్పత్తిదారుల ధరలను వెంటనే పునరుద్ధరించాలని సీపీఎం కన్వీనర్ రాము డిమాండ్ చేశారు. పాల ధరలు తగ్గించడం పట్ల అచ్యుతాపురంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. పాడి రైతుల కష్టంతో రూ.కోట్లకు పడగెత్తిన డైరీ యాజమాన్యం.. డైరీని నమ్ముకున్న పాడి రైతులను మాత్రం రోడ్డుమీదకు లాగుతోందని మండిపడ్డారు.