EG: తుఫాను నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. 30 రైళ్లకు పైగా రద్దు కాగా, ఈనెల 25వరకు వాటిని పునరుద్ధరించే అవకాశం లేనట్లు కన్పిస్తోంది. దీంతో సికింద్రాబాద్, వైజాగ్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలు స్టేషన్లలో అధికారులు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు.