కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గిందని డ్యామ్ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 19,858 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోందన్నారు. ప్రస్తుతం 101.61 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. 15,290 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.