NLR: ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం బాధ్యతగా అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల పనితీరు మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. బుధవారం డక్కిలి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అందుబాటులో ఉన్న మందుల ఎక్స్పైరీ, రక్త పరీక్ష ల్యాబులను పరిశీలించారు.