VZM: నెల్లిమర్ల మండలం జోగిరాజుపేటలో రక్షిత మంచినీటిని టెస్టులను మండల ప్రత్యేకాధికారి పి కూర్మినాయుడు బుధవారం పరిశీలించారు. గుర్ల మండల కేంద్రంలో డయేరియా ప్రబలడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాగునీటి పథకాలను క్లోరినేషన్ చేయడం నీటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ రాజు, విస్తరణ అధికారి శంకర జగన్నాథ్, అధికారులు పాల్గొన్నారు.