PLD: ప్రతి సోమవారం నరసరావుపేట కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రేపు చిలకలూరిపేటలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని ఈ నెల 28న చిలకలూరిపేటలోని శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు కళ్యాణ మండపంలో ఉదయం 10 నుంచి కలెక్టర్ అధ్యక్షతన జరుగనుందన్నారు.