VZM: నెల్లిమర్ల జ్యోతిబా ఫూలె బీసీ బాలికల గురుకులం ప్రిన్సిపాల్‌గా పి.శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన రమామోహిని సింహాచలం గురుకులం ప్రిన్సిపాల్‌గా బదిలీపై వెళ్లారు.