కృష్ణా: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీలకు కొమ్ముకాసే వారిపై ఎటువంటి కేసులు పెట్టడం లేదన్నారు.