ELR: ఏలూరు రూరల్ మండలం గుడివాడ లంక గ్రామ పెద్దలు వేధింపులు భరించలేక వృద్ధ దంపతులు కారుణ్య మరణం కోరుతూ జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. సైదు ఇజ్రాయిల్ మహాలక్ష్మి దంపతులను నాలుగేళ్లుగా గ్రామ పెద్దలు వేధింపులకు గురి చేస్తున్నారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేశారని గ్రామ ప్రజలు వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.