KRNL: అధిక శబ్దం కలిగించే 110 సైలెన్సర్లను కర్నూలు జిల్లా ఎస్పీ మాధవ్ రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేయించారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలు నగరంలో 4 రోజులలో ట్రాఫిక్ పోలీసులు 60 సైలెన్సర్లు, పట్టణ పోలీసులు 50 సైలెన్సర్లను సీజ్ చేశారని చెప్పారు. ద్విచక్ర వాహనాలకు మాడిఫైడ్ సైలెన్సర్లను అమర్చుకొని 80 డెసిబల్స్ కంటే అధిక శబ్దం ఉన్నవాటిని ధ్వంసం చేశామన్నారు.