ATP: కనేకల్లు మండలం హనకనహాల్ గ్రామంలోని రథానికి నిప్పంటించిన ఘటనను పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బొడిమల్ల ఈశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ ఘటన వెల్లడించారు. రథం తయారీలో గ్రామస్థుల సహకారం, చందాలు తీసుకోలేదనే అక్కసుతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వెల్లడించారు. అందుకుగాను కనేకల్లు పోలీసులను జిల్లా ఎస్పీ జగదీశ్ అభినందించారు.