అన్నమయ్య: దీపావళి నుండి ఉచిత సిలిండర్ల పథకం అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తామని చెప్పారు. రాబోయే ఐదు సంవత్సరాలలో నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తామన్నారు. అర్హులందరికీ పారదర్శకంగా పథకాలు అమలు చేస్తామన్నారు.