»Twitter Discussion Between Tdp And Ycp Over Rushikonda Buildings Visakhapatnam
Rushikonda: కట్టడాలపై టీడీపీ, వైసీపీ మధ్య ట్విట్టర్లో లొల్లి
ఏపీ విశాఖలోని రిషికొండ(rushikonda) కట్టడాలపై అధికార వైసీపీ(YSRCP), ప్రతిపక్ష టీడీపీ(TDP) పార్టీల మధ్య సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటు విరుచుకుపడుతున్నారు. మీరంటే మీరే అక్రమాలు చేశారని దుయ్యబట్టుకుంటున్నారు. అయితే ఈ లొల్లి ఏంటో ఇప్పుడు చుద్దాం.
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం(visakhapatnam)లోని రిషికొండ(Rushikonda)లను విచక్షణారహితంగా తవ్వి కట్టడాలు చేసినట్లు చూపించే డ్రోన్ కెమెరా దృశ్యాలను ఇప్పటికే జనసేన పార్టీ శనివారం రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. వైజాగ్లో రిషికొండపై జరుగుతున్న నిర్మాణాలు రాష్ట్ర సచివాలయం కోసమే అన్నట్లు వైసీపీ సోషల్ మీడియాలో ఓ ట్విట్ పోస్ట్ చేసింది. అయితే అది చూసిన టీడీపీ నేతలు దానిపై కామెంట్లు చేశారు. అయితే ఆ క్రమంలో వెంటనే అప్రమత్తమైన వైసీపీ నేతలు ఆ ట్విట్ డిలీట్ చేశారు.
అయితే మా అధికారిక ట్విట్టర్(Twitter) ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్లో పొరపాటున పేర్కొనడం జరిగిందని తర్వాత వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరని మరో ట్వీట్ చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ట్వీట్టర్లో కౌంటర్ల వివాదం మొదలైంది.
మా అధికారిక ట్విట్టర్ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరు.
అంతేకాదు వాస్తవానికి మానవ తప్పిదాలు అనేవి సహజంగానే జరుగుతుంటాయని వైసీపీ(YSRCP) స్పష్టం చేసింది. అలాగే ఇది కూడా జరిగిందన్నారు. దానిపై ప్రజలకు తిరిగి వివరణ ఇవ్వడం కూడా ఇచ్చామని చెప్పారు. ఒక తప్పిదం జరిగితే అది జరిగిందని ఒప్పుకుని, దానిని ప్రజలకు వివరించి చెప్పే దమ్ము దైర్యం మాకు ఉందని పేర్కొన్నారు. కానీ మీ నాయకుడు చంద్రబాబు మాదిరిగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా ప్రజలను మభ్యపెట్టే తప్పుడు కార్యక్రమాలు మేమెప్పుడు చేయలేదని అన్నారు. అయితే ఇదీ మా నాయకుడు వైఎస్ జగన్ మాకు నేర్పిన లక్షణమని ఇదీ మా విశ్వసనీయత అంటూ వైసీపీ నేతలు ట్వీట్ చేస్తు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వాస్తవానికి మానవ తప్పిదాలు అనేవి సహజంగానే జరుగుతుంటాయి, అలాగే ఇది కూడా జరిగింది. దానిపై ప్రజలకు తిరిగి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఒక తప్పిదం జరిగితే అది జరిగింది అని ఒప్పుకుని, దానిని ప్రజలకు వివరించి చెప్పే దమ్ము దైర్యం మాకు ఉంది, కానీ మీలాగా మీ నాయకుడు @ncbn లాగా, ఉన్నది… https://t.co/7lLYRd9SLT
మరోవైపు మంత్రి రోజా మాట్లాడిన వ్యాఖ్యలపై కూడా టీడీపీ(TDP) మరో ట్వీట్ చేస్తు కౌంటర్ ఇచ్చారు. జగన్ రుషికొండ ప్యాలెస్ ని, తిరుమల, శ్రీశైలం & సింహాచలంతో ఈ దౌర్భాగ్యురాలు పోల్చిందని ఎద్దేవా చేశారు.