నందమూరి తారకరత్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన గత నెల 27న గుండెపోటుతో కుప్పంలో కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. హుటాహుటిన ఆయన్ను కుప్పంలోని ఆసుపత్రికి తరలించి ఆ రాత్రే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం తారకరత్నకు చికిత్స చేసింది. నారాయణ ఆసుపత్రిలో రెండు రోజుల చికిత్స తర్వాత ఆయనకు స్పృహ వచ్చింది.
ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉన్నా.. ఇంకా కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్కానింగ్ రిపోర్ట్ ప్రకారం మెదడుకు కూడా చికిత్స చేస్తున్నారు. విదేశాల నుంచి తారకరత్న కోసం ప్రత్యేకంగా వైద్యులను ఎన్హెచ్ ఆసుపత్రి యాజమాన్యం రప్పించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.