ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంత్యక్రియల(Funeral)కు వచ్చి ముగ్గురు అనంతలోకాలకు చేరుకున్నారు. ప్రమాదవశాత్తూ విద్యుత్ ఘాతాని(Electrocution)కి గురై ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కుప్పం మండలం తంబిగానిపల్లె గ్రామానికి చెందిన రాణి అనే 65 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో శుక్రవారం చనిపోయింది.
రాణి అంత్యక్రియలు(Funeral) చేయడానికి సాయంత్రం గ్రామ శివారులోని శ్మశానవాటికకు గ్రామస్తులు తీసుకెళ్లారు. అయితే శ్మశానవాటిక వద్ద విద్యుత్ తీగలు వేలాడుతుండటాన్ని అక్కడున్న వారు ఎవ్వరూ గమనించలేదు. మృతదేహాన్ని(Deadbody) తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు పాడెకు తగడంతో దారుణం(Tragedy) జరిగింది.
పాడెను మోస్తున్న రవీంద్రన్, తిరుపతి, మునప్ప అనే ముగ్గురికి విద్యుత్ తీగలు తగిలి(Electrocution) తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో ఆ ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరొకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.