Ram Gopal Varma: స్కిల్ స్కామ్లో చంద్రబాబును ఊరట లభించడం లేదు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయగా.. ఏసీబీ కోర్టు 2 రోజుల సీఐడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. చంద్రబాబు ఫేమస్ లాయర్లను నియమించుకున్నారు. అయినప్పటికీ నో యూజ్.. సో, ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. దాంతో సిద్దార్థ లూథ్రా ట్వీట్ చేశారు. దానికి సంచనాలకు కేంద్ర బిందువు అయిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కౌంటర్ ఇచ్చారు.
ప్రతీ రాత్రి తర్వాత తెల్లవారుతుంది. ప్రతీ ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తోందని లూథ్రా ట్వీట్ చేశారు. రెండు కోర్టుల తీర్పు తర్వాత పోస్ట్ చేశారు. దానికి రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. జైలు గదిలో పగలు, రాత్రి ఒకేలా ఉంటాయ్ కదా సర్ అని పేర్కొన్నారు. అంటే చంద్రబాబును బయటకు తీసుకురాలేమని ఆయన ట్వీట్ చేయగా.. జైలు గదిలో తేడాలు ఉంటాయా..? ఎందుకు బాధపడుతున్నారని సెటైర్లు వేశారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు రిమాండ్ కూడా ఈ రోజు ముగిసింది. మరో రెండురోజుల రిమాండ్ పొడగించింది. ఆదివారం సాయంత్రం వరకు రిమాండ్లో ఉంటారు. ఆ రోజు సాయంత్రం సీఐడీ కస్టడీ కూడా ముగియనుంది.
Har raat ki subah Aati hai Naya din Ujala laata hai – there is dawn after night and each morning brings light into our lives