Kannababu: నటసింహాం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు (Kannababu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో బాలకృష్ణ నిన్న చేసిన హంగామా గురించి ప్రస్తావించారు. ఐదేళ్లకోసారి పోటీ చేసే ప్రజా ప్రతినిధులు మానసిక స్థితి చెక్ చేసే చికిత్స రావాలని రేణుకా చౌదరి చెప్పారని.. సర్టిపికెట్ తీసుకున్న వారే పోటీ చేయాలని కన్నబాబు అభిప్రాయపడ్డారు. అప్పుడు ఎవరీ పరిస్థితి ఏంటో తెలుస్తోందని వివరించారు.
బాలకృష్ణ మెంటల్ కేసు అని మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు. ఇదే విషయం నిన్న సభలో రుజువు అయ్యిందని తెలిపారు. బాలయ్య మెంటల్ అని నాలుగు ఆస్పత్రులు సర్టిఫైడ్ చేశాయని చెప్పారు. సర్టిఫైడ్ సైకో బాలయ్య అని.. ఈ దేశంలో ఆయనకు తప్ప మరెవరికి ఆ పేరు లేదని పేర్కొన్నారు. నిండు సభలో ప్రవర్తించిన తీరు ఎబ్బెట్టుగా ఉందన్నారు.
సభలో ఉండి అలాంటి సంజ్ఞలు చేస్తారా అని మంత్రి కన్నబాబు అడిగారు. ఆ సైగలు ఏంటీ..? మీసం ఎందుకు తిప్పావ్, తోడ ఎందుకు కొట్టావని మంత్రి అంబటి రాంబాబు అడిగితే.. అదీ తన వృత్తి ధర్మం అంటారా అని మండిపడ్డారు. బెంచ్ ఎక్కడం, చంద్రబాబు సీటులో కూర్చొవడం ఏంటోనని తెలియడం లేదన్నారు. సభలో కూర్చొని విజిల్ వేయడం ఏంటీ అని కన్నబాబు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్ సర్టిఫికెట్ తీసుకోవాలని.. ఆ తర్వాతే పోటీ చేయాలని సూచించారు.
ఈ దేశం మొత్తం మీద మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఏకైక ఎమ్మెల్యే బాలకృష్ణ.