జగన్ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు జల్లిందంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.ఒక వైపు జగన్.. విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామని.. తాను కూడా విశాఖ కు మారిపోతానని ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో(telugu states) మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. అందేంటీ అనుకుంటున్నారా. అవును రెండు రాష్ట్రాల్లోని 15 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేదుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న 9 స్థానాలతోపాటు ఖాళీ కానున్న 6 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్(MLC elections Schedule 2023) ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవ...
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రామశివారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ అని, తనకు మేలు జరిగేలా ఆయన మాట్లాడించారని ఎద్దేవా చేశారు. మరో ఆరు నెలల తర్వాత ఏపీలో మరిన్ని చాలా చిత్రాలు, విచిత్రాలు చూస్తారన్నారు.
దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఈడీ(ED), సీబీఐ(CBI) అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను క్రమంగా అదుపులోకి తీసుకుంటూ మరికొంత మందిని అరెస్టు చేస్తున్నారు. బుధవారం(ఫిబ్రవరి 8న) ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న కాసేపటికే గౌత...
ముఖ్యమంత్రి జగన్ పాలనా ప్రభావం వచ్చే పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడనికి కేవలం పదేళ్లు చాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అనుసరించి, 2015లో నాటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేసిందని, చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం నిర్మాణం కోసం రూ.2500 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.
Chandrababu Naidu Shocking Comments on AP Elections. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని స్పస్టం చేశారు. ఏ క్షణంలో అయినా సీఎం వైఎస్ జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణుల...
సింగర్ యశస్వి కొండేపూడి (Yasaswi Kondepudi) వివాదంలో ఇరుక్కున్నారు. కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ (Navasena Foundation) అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఫౌండేషన్ తనది అని అతను చెప్పుకుంటున్నాడని, ఆయన మోసం చేశారని నిర్వాహకురాలు ఫరా (farah) ఆరోపించారు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 వస్తే చాలు ప్రేమికులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరికొంత గులాబీలు ఇచ్చుకుంటూ ప్రపోజ్ చేసుకుంటారు. ఇంకొంత మంది అయితే సినిమాలు, షికార్లు అంటూ రకరకాలుగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ రోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. కానీ ఈసారి మాత్రం కొంచెం వినూత్నంగా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న ప్రేమికులు గోవు...
మంత్రివర్గ సమావేశంలోనూ రాజధాని అంశమే ప్రధానంగా చర్చించారు. విశాఖలో చేయాల్సిన పనులు, తరలించాల్సిన కార్యాలయాలు వంటి వాటిపైనే చర్చలు చేశారు. పెండ్లి కానుకల పథకాలైన కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలను ఈనెల 10వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
అతి విశ్వాసంతో ముందుకు వెళ్తున్న జగన్ కు ప్రజల నుంచి గుణపాఠం తప్పదని రాజకీయ మేధావులు హెచ్చరిస్తున్నారు. ఈసారి 175కు 175 సీట్లు అంటూ అతి విశ్వాసంతో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం కానున్నారని సమాచారం.
ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్విస్ట్. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కాల్ రికార్డింగ్ మాత్రమేనని బయటకు వచ్చాడు ఎమ్మెల్యే స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ రామశివారెడ్డి.
పాదయాత్రలపై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మన తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలు కీలక పాత్ర పోషిస్తాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ వీరంతా పాదయాత్ర లు చేసిన తర్వాత.. సీఎం పదవి దక్కించుకున్నవారే.
అమిత్ షాకి లేఖ రాసిన కోటంరెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగనే స్వయంగా తన ఫోన్ ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు.
అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల నుంచి రాజధాని ప్రాంతవాసులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాలు కూడా అమరావతికే మొగ్గు చూపగా సీఎం జగన్ కక్షపూరితంగా రాజధానిని విశాఖను మారుస్తున్నాడు.