Chandhra Babu Naidu : ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు పలు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ఇదేం ఖర్మరా బాబూ పేరిట ఆయన ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలోని నెల్లూరు, (Nellore) సంగం బ్యారేజీలకు ప్రతిష్టాత్మక సీబీఐపీ (CBIP) అవార్డుకు ఎంపికయ్యాయి.పెన్నా డెల్టా (Penna Delta) ఆధునికీకరణలో భాగంగా నెల్లురు (0.4 టీఎంసీలు), సంగం బ్యారేజ్ (0.45 టీఎంసీలు)లను వైసీపీ (YCP) ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది.
రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం రాత్రి 10 గంటల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో గుండెపోటుకు గురయ్యారు.
దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలలో ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాశీ విశ్వనాథ్, సోమ్ నాథ్, కాళేశ్వరం, వేములవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి మహాప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకాలు భక్తులు చేశారు.
ఏపీ సీఎం జగన్ (CM Jagan) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన కేబినెట్‌లో (Cabinet) పని చేస్తున్న ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని సమాచారం. వారి స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది.
chandrababu:ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు (chandrababu) పర్యటనను కూడా పోలీసులు (police) అడ్డుకుంటున్నారు. నిన్న పెద్దాపురం (peddapuram) బహిరంగ సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అనపర్తిలో ఈ రోజు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడుగు అడుగునా అడ్డుకున్నారు.
Rayapati sambashiva rao:ఏపీలో అప్పుడే ఎన్నికల హడావిడి నెలకొంది. పొత్తులపై మాత్రం తేలడం లేదు. బీజేపీ- టీడీపీ అని ఒకరు.. బీజేపీ- జనసేన అని మరొకరు.. టీడీపీ- జనసేన అని మరొ నేత కామెంట్ చేస్తున్నారు. అగ్ర నేతలు మాట్లాడుకుంటున్నారు. రాయపాటి సాంబశివరావు మాత్రం టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తాయని అంటున్నారు.
Kodali nani:టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై (nara lokesh) మాజీమంత్రి కొడాలి నాని (kodali nani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యువగళం పాదయాత్రలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ పులిబిడ్డ వైఎస్ జగన్ అని స్పష్టంచేశారు. ఆయన పుట్టి, పెరిగింది కడప జిల్లాలో అని తెలిపారు. నీ లాగా హైదరాబాద్‌లో (hyderabad) కాదన్నారు.
తన నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసం అభ్యర్థించినా ప్రయోజనం లేకుండా పోయిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కక్ష సాధింపు చర్యలు తీవ్రం చేసింది. ఇప్పటికే పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. అయినా కూడా లోకేశ్ మైక్ లేకుండానే పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. ఇక పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ...
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు.
Pawan Kalyan : విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చనిపోయిన చిన్నారి విషయంలో పవన్ ఎమోషనల్ అయ్యారు. ఆస్పత్రిలో చిన్నారి చనిపోతే... స్వస్థలానికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వకపోవడంతో... ఆ బిడ్డ తల్లిదండ్రులు దాదాపు 120 కిలోమీటర్లు.. శవాన్ని బైక్ పై తీసుకువెళ్లారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది. కాగా... ఈ ఘటనపై పవన్ స్పందించారు.
రిపాలన రాజధానిగా కాబోతున్న విశాఖపట్టణంలో ఇలాంటి ఘటనలో గతంలో చాలానే జరిగాయి. జనవరి 6న సచివాలయ కన్వీనర్ పై కూడా గంజాయి మత్తులో కొందరు దాడులు చేశారు. ఒక రోజు పోలీస్ రక్షక్ వాహనంపై కూడా దాడి చేశారని తెలుస్తున్నది. విశాఖపట్టణంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. బహిరంగంగానే వీటి విక్రయాలు సాగుతున్నాయి.
రాయలసీమ నీరు, వాటర్ ట్యాంకుకు సంబంధించి రోజా, నాగబాబుల మధ్య ఇటీవల ట్విట్టర్ (Twitter) యుద్ధం నడిచింది. ఈ అంశంపై నాగబాబుకు మద్దతుగా ఓ మహిళ... మంత్రి పైన దుమ్మెత్తిపోశారు. అంబటి రాంబాబు పర్యవేక్షణలో రోజా నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు... నగరికి వైయస్సార్ పోలవరం అంటూ ఎద్దేవా చేశారు.